దేవతల నగరంగా అమరావతి ప్రసిద్ధి

GNTR: నవ్యంధ్ర రాజధాని అమరావతి చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల రాజధానిగా పేరు పొందింది. దేవతల నగరంగా ఖ్యాతి గాంచింది. బౌద్ధ మతం ఇక్కడ విలసిల్లింది. ఉమ్మడి జిల్లా పరిధిలో కృష్ణా నది పక్కనే ఉన్న అమరావతి ఎన్నో విశిష్టతలు కలిగి ఉంది. బౌద్ధ స్తూపం, మ్యూజియం, ధ్యాన బుద్ధ విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.