'పొగాకు రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి'
AKP: పొగాకు రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా అదనపు ఎస్పీ మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో జాతీయ పొగాకు నియంత్రణపై నిర్వహించిన సమావేశంలో డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ హైమావతితో కలిసి పాల్గొన్నారు. పాఠశాలల వద్ద పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.