ఇందిరాగాంధీ కి కాంగ్రెస్ నాయకుల నివాళి
MNCL: అందరికీ ఆదర్శమైన మూర్తి మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక ఐబీలో ఇందిరాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఇందిరా గాంధీ హాయంలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు.