దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

HYD: ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న శివ అనే నిందితుడిని కేపీహెచ్‌బీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. నిందితుడు శివపై గతంలో కేపీహెచ్‌బీ, మియాపూర్, బాచుపల్లి పీఎస్‌లో కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి 15 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.