ధోనీతో ప్రభ్ సిమ్రన్‌ను పోల్చిన హేడెన్

పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ బ్యాటింగ్ చూస్తుంటే 2010లో యువ ధోనీ గుర్తుకొస్తున్నాడని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ హేడెన్ అన్నాడు. గతంలో ధోనీ తన సిక్స్‌లు కొట్టే సామర్ధ్యంతో ఇలాగే ఆశ్చర్యపరిచేవాడని హేడెన్ తెలిపాడు. అతడిలాగే అద్భుతమైన బ్యాటింగ్ వేగం ప్రభ్ సిమ్రన్ సొంతమన్నాడు. లక్నోతో మ్యాచ్‌లో అతడి ఆటతీరు అద్భుతమని మెచ్చుకున్నాడు.