మనాలి అడ్వెంచర్ క్యాంప్‌కు ఎంపికైన ఉమా
బాపట్ల: ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ యు. ఉమా మనాలి అడ్వెంచర్ క్యాంప్‌కు ఎంపికయ్యారు. గుంటూరులో జరిగిన ఎంపికల్లో సుమారు 40 మంది క్యాడెట్లు పోటీ పడ్డారు. శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాల ఆధారంగా సీఎస్ఈ 3వ సంవత్సరం చదువుతున్న ఉమాను అధికారులు ఎంపిక చేశారు. ఏప్రిల్ 17 నుంచి 26 వరకు మనాలిలో ఈ క్యాంప్ జరగనుంది.