పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
NGKL: పెంట్లవెల్లి మండలం జటప్రోలు లో సోమవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువైద్యాధికారి డాక్టర్ మౌనిక, మాజీ వైస్ ఎంపీపీ భీమిరెడ్డి కలిసి టీకాలు వేశారు. గాలికుంటు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గుతుందన్నారు. తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.