కరుగుతున్న గుట్టలు కారణం అధికారులా..?

కరుగుతున్న గుట్టలు కారణం అధికారులా..?

NRPT: మాగనూరు మండలంలోని నల్లగట్టు మారెమ్మ గుడి దగ్గర ఉన్న గుట్ట రోజురోజుకు మైనింగ్ మాఫియా చేతిలో రూపురేఖలు కోల్పోతుంది. అనుమతులు కొన్ని ఉన్నా, లేని అనుమతులతో గుట్టను తవ్వుతూ మైనింగ్ బకాసురులు గుట్టను కాజేస్తున్నారు. గుట్టలను కాజేస్తున్న మైనింగ్ మాఫియాకు అండ అధికారులేనా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజలను ఆలోచింపజేస్తుంది.