లక్ష్మాపూర్ తండాలో ఘనంగా తీజ్ వేడుకలు

NGKL: అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ తండాలో తీజ్ పండుగను గిరిజనులు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా గిరిజన యువతులు బుట్టల్లో విత్తనాలు నాటి, పాటలు పాడుతూ, ఊయల ఊగుతూ పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తీజ్ పండుగ ప్రకృతి ఆరాధనతో పాటు లంబాడీల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతుందన్నారు.