రేపు కల్లూరు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

రేపు కల్లూరు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

KMM: కల్లూరు పురపాలక సంఘానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన 20 వార్డుల కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నిర్వహించనున్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని కమిషనర్ రామదుర్గారెడ్డి తెలిపారు. విజయం సాధించిన అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో సకాలంలో హాజరుకావాలని సూచించారు.