చేరువులో గుర్తు తెలియని మృతదేహం

VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి కొత్త సుంకరపాలెం దత్తుడు బంద చేరువులో గుర్తు తెలియని మృతదేహం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులు గుర్తించి పోలీసు స్టేషన్ పిర్యాదు చేశారు. షర్ట్ తుప్పల్లో పడి ఉండడంతో పలు అనుమానాలకు తావీస్తుంది. ఈ మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.