ICDS ఆధ్వర్యంలో 'రెస్క్యూ డ్రైవ్'

ICDS ఆధ్వర్యంలో 'రెస్క్యూ డ్రైవ్'

W.G: భీమవరం పట్టణంలోని పలు ప్రాంతాలలో చెత్త సేకరిస్తూ జీవిస్తున్న పిల్లల రక్షణ కోసం, బాలల సంరక్షణ యూనిట్ నిన్న 'రెస్క్యూ డ్రైవ్' నిర్వహించింది. ఈ డ్రైవ్‌లో కత్తి ఏసుబాబు (11) మరియమ్మ(6) అనే ఇద్దరు చిన్నారులను గుర్తించినట్లు బాలల సంరక్షణ యూనిట్ అధికారులు తెలిపారు. ఏసుబాబును ఏలూరు ప్రభుత్వ బాలుర వసతిగృహానికి, మరియమ్మను తణుకు బాలనందం సదస్సులో చేర్పించారు.