వాహనం ఢీకొని మహిళ మృతి

సత్యసాయి: వాహనం ఢీకొని గుర్తుతెలియని మహిళ(55) మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. పరిగి ఎస్సై వివరాల మేరకు.. కోడికొండ-సిరా జాతీయ రహదారి ధనాపురం క్రాస్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.