చిరంజీవి అభిమానుల సేవా కార్యక్రమాలు

W.G: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిరంజీవి అభిమానులు గురువారం ప్రజలకు పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేశారు. చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమానుల జిల్లా అధ్యక్షుడు కోపల్లి శ్రీనివాస్ సూచించారు. మొగల్తూరు మండల శాఖ అధ్యక్షుడు దాసరి కృష్ణాజి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు.