శివాలయాల్లో ప్రత్యేక పూజలు

శివాలయాల్లో ప్రత్యేక పూజలు

VSP: కార్తీక మాసంలో ఇవాళ ఆఖరి సోమవారం కావడంతో శివాలయాలు కిటకిటలాడాయి. ఆరిలోవ, తోటగరువు, మధురవాడ, పీఎంపాలెం, కొమ్మాది, ఎంవీపీ కాలనీ, మద్దిలపాలెం, జంగాడ ప్రాంతాల్లో భక్తులు పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తోటగరువులో గల తోటనందీశ్వర ఆలయంలో మురళీకృష్ణ ఉత్తమ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపినట్టు ఆ సంఘం సభ్యులు తెలిపారు.