'సమానత్వ సమాజ నిర్మాణానికి పూలే ఆశయాలే మార్గదర్శకం'

'సమానత్వ సమాజ నిర్మాణానికి పూలే ఆశయాలే మార్గదర్శకం'

అన్నమయ్య: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని మదనపల్లి కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్, ఎమ్మెల్యే షాజహాన్‌తో పాటు అధికారులు, బీసీ సంఘాల నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే అణగారిన వర్గాల అభ్యున్నతి, స్త్రీ విద్య, సమానత్వ సమాజ నిర్మాణానికి చేసిన సేవలను వారు కొనియాడారు.