తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

TPT: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. గురువారం మొత్తం 57,272 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లుగా నమోదైంది.