స్పెషలాఫీసర్‌ను సన్మానించిన తాజా మాజీ ఛైర్మన్

MHBD: మహబూబాబాద్ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించబడిన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ లెనిన్ వత్సల్ టోపో ఐఏఎస్‌ను నేడు తాజా మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి సన్మానించారు. తాజా వైస్ ఛైర్మన్ మార్నేని వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు మారినేని రఘు తదితరులు పాల్గొన్నారు.