VIDEO: పులి సంచారం.. పలు గ్రామాల్లో డప్పు చాటింపు
MNCL: మందమర్రి మండలం అదిల్ పేట్, మామిడిగట్టు గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని, పంట రక్షణకు విద్యుత్ వైర్లు అమర్చకూడదని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని పంచాయతీ సిబ్బంది డప్పు చాటింపు వేశారు.