మహిళా ఆకాశం యాప్‌పై శిక్షణ కార్యక్రమం

మహిళా ఆకాశం యాప్‌పై శిక్షణ కార్యక్రమం

AKP: నర్సీపట్నం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో మహిళా ఆకాశం యాప్ మీద సిబ్బందికి మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రిసోర్సెస్ పర్సన్ మేడికొండ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఆర్పీల పరిధిలో మహిళా సంఘాల సమాచారాన్ని కచ్చితంగా యాప్లో నమోదు చేయాలన్నారు. నమోదు ద్వారా గ్రూప్ సభ్యుల సమగ్ర సమాచారం తెలుస్తుందన్నారు.