బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్
W.G: భీమవరం (M) గొల్లవానితిప్ప జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడు పనిచేస్తున్న సుధీర్ బాబును సస్పెండ్ చేస్తూ డీఈవో నారాయణ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఈనెల 5న ఆయనకు ఫిర్యాదు వచ్చిందన్నారు. త్రిసభ్య కమిటీ ద్వారా విచారణకు ఆదేశించామన్నారు. విచారణలో ఆరోపణలు నిజం కావడంతో సస్పెండ్ చేశామన్నారు.