VIDEO: మళ్లీ పులి అలజడి.. పరుగులు తీసిన సిబ్బంది
KKD: దేవీపట్నం మండలంలోని పాత పరగసానిపాడు, బోడిగూడెం గ్రామాల మధ్య సోమవారం పులి సంచారం కలకలం రేపింది. అటవీశాఖ సిబ్బంది వాహనాల్లో వెళ్తుండగా పులి అలికిడితో భయాందోళనకు గురై వెనక్కి పరుగులు తీశారు. కాకినాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లోనూ పులి కదలికల పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.