'ఆయిల్ పామ్ సాగుకు మంచి ప్రోత్సాహం వస్తుంది'
KMM: రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆయిల్ పామ్ సాగుకు మంచి ప్రోత్సాహం వస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగేందర్ అన్నారు. శుక్రవారం రఘునాథపాలెం రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులందరూ ఆయిల్ పామ్ సాగు వైపు వెళ్లాలని సూచించారు. అటు గోద్రెజ్ కర్మాగారం అతి త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.