దామరవంచలో ఉత్కంఠగా మారిన సర్పంచ్ ఫలితం

దామరవంచలో ఉత్కంఠగా మారిన సర్పంచ్ ఫలితం

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం దామరవంచ సర్పంచ్‌ ఫలితం ఉత్కంఠగా మారింది. మొదట కౌంటింగ్ నిర్వహించగా.. 3 ఓట్లతో BRS మద్దతుదారు స్వాతి విజయం సాధించారు. అయితే, రీ కౌంటింగ్‌లో మాత్రం ఫలితం మారింది. కాంగ్రెస్‌ మద్దతుదారు సుజాత ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. ఫలితం మారడం పట్ల స్వాతి అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.