VIDEO: అరకులో కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే

ASR: అరకు గురుకుల జూనియర్ కళాశాల, అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే మత్స్యలింగం కోరారు. శుక్రవారం అరకు ట్రైబల్ మ్యూజియం ప్రాంగణంలో అరకు కాఫీ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కలెక్టర్ దినేష్ కుమార్‌ను ఎమ్మెల్యే కలిశారు. ఆయా కళాశాలల్లో హాస్టల్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.