జనసేన కమిటీల నిర్మాణంపై పవన్ కసరత్తు
AP: జనసేన కమిటీల నిర్మాణంపై పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళంలో నాయకత్వాన్ని పటిష్టం చేయాలని తెలిపారు. జనసేన పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. అలాగే.. కమిటీల నిర్మాణం, కూర్పుపై జనసేన కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.