VIDEO: పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్ధృతంగా గోదావరి

ELR: గోదావరి వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 31.770 మీటర్ల నీటిమట్టం చేరింది. స్పిల్ వే 48 గేట్ల నుంచి 8.11 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. దిగువన వరద ప్రవాహం పెరిగి ఉభయ గోదావరి జిల్లాల మధ్య లంక ఒడ్డును తాకూతూ ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద 36.80 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.