గంజాయి సేవిస్తున్న ముగ్గురుని పట్టుకున్న పోలీసులు
నిజామాబాద్ శివారులో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ SHO శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఖానాపూర్‌లో గంజాయి సేవిస్తున్న అజయ్, నీతుల అఖిల్, రంజిత్ కుమార్ గంజాయి సేవిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని చెక్ చేయగా గంజాయి సేవిస్తున్నట్లు రుజువుకావడంతో కోర్టులో హాజరుపరిచి ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.