ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్
SRCL: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్టల్ బేగం, జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు, ఏపీఎంలు, పీఏసీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.