VIDEO: రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం
HYD: సోమాజిగూడలోని శ్రీ కన్య రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని 5వ అంతస్తులో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.