హత్య కేసులో నిందితుడు అరెస్ట్

హత్య కేసులో నిందితుడు అరెస్ట్

TPT: చిల్లకూరు వడ్డిపాలెంలో మంగళవారం జరిగిన అచ్చి ప్రవీణ్ హత్య కేసుకు సంబంధించి నిందితుడు బండి సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసినట్లు గూడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కిషోర్ బాబు తెలిపారు. కాగా పాతకక్షల కారణంగానే సుబ్రహ్మణ్యం ప్రవీణ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.