'పరిమితిలో ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలి'

'పరిమితిలో ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలి'

JGL: ఇందిరమ్మ గృహ నిర్మాణాలను నిర్దేశిత కాల పరిమితిలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. భీమారం మండలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం, పన్నుల వసూళ్లు, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్ పనులు, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా గృహప్రవేశాలు చేసుకోవాలన్నారు.