విషాదం.. చెరువులో దిగి బాలుడు మృతి

విషాదం.. చెరువులో దిగి బాలుడు మృతి

KKD: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాకినాడ రూరల్ తిమ్మాపురం శివాలయం దగ్గర ఉన్న చెరువులోకి దిగి మురళి కృష్ణ (15) అనే బాలుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన బాలుడు కొత్తూరు గ్రామానికి చెందినట్లుగా  గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.