రాజకీయాల్లో పూర్తి విరామం ఉండదు: మోదీ

రాజకీయాల్లో పూర్తి విరామం ఉండదు: మోదీ

ఏప్రిల్, జులై మధ్యకాలంలో 59 మంది రాజ్యసభ పదవీకాలం యుగియనుంది. ఈ సందర్భంగా ఎగువ సభలో ప్రధాని మోదీ వారి సేవలను కొనియాడారు. రాజకీయాల్లో పూర్తి విరామం అనేది ఉండదన్నారు. సభలో లేనప్పటికీ సామాజిక జీవితంలో చురుకుగా వ్యవహరించాలని కోరారు. దేవెగౌడ, ఖర్గే, NCP అధినేత శరద్ పవార్ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. వారు తమ జీవితాన్ని పార్లమెంటరీ కార్యకలాపాల్లోనే గడిపారని కితాబిచ్చారు.