పులి పంజా.. లేగ దూడలపై దాడి
KKD: జిల్లా నుంచి పోలవరం చేరిన పెద్దపులి దేవీపట్నం మండలం కొత్తవీధి గ్రామంలో పంజా విసిరింది. శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలోకి చొరబడి ఒకే సారి 3 దూడలపై దాడి చేసి హతమార్చింది. కొన్ని రోజులుగా రోజుకొక పశువును వేటాడుతున్న పులి, ఇప్పుడు ఒకేసారి మూడింటిని చంపడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు పాదముద్రలను పరిశీలిస్తున్నారు.