దువ్వుపాలెంలో ఘనంగా అయ్యప్ప స్వామి ఊరేగింపు

దువ్వుపాలెంలో ఘనంగా అయ్యప్ప స్వామి ఊరేగింపు

VSP: పెందుర్తి మండలం దువ్వుపాలెంలో ఆదివారం రాత్రి అయ్యప్ప స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్వామి మాల ధరించిన భక్తులు అందరూ స్వామి వారి విగ్రహాన్ని గ్రామ పురవీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తి పాటలతో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.