CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ATP: ఆపదలో ఉన్న బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న 43 మంది బాధితులకు ఆయన కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో రూ. 32.56 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి ఒక వరం లాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.