‘తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి’
AKP: వేసవికాలంలో పాయకరావుపేట మండలంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఇసరపు పార్వతి సూచించారు. శనివారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు. ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు.