'పెద్ది' వాయిదా ప్రచారానికి చెక్
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా వాయిదా పడనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై తాజాగా చిత్ర బృందం స్పందించింది. అనుకున్న సమయానికే, అంటే మార్చి 27, 2026న చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర బృందం స్పష్టం చేసింది. కాగా, రేపటి నుంచి హైదరాబాద్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.