రుషికొండ బీచ్‌లో పోలీసుల భద్రతా చర్యలు
VSP: 'మొంథా' తుపాను ముప్పు నేపథ్యంలో, రుషికొండ బీచ్ వద్ద భద్రతా సోమవారం ఉదయం నుంచి చర్యలు ముమ్మరం చేశారు. బీచ్ సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి, బీచ్ మూసివేత ఆపరేషన్‌ను నిర్వహించారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎవరినీ లోపలికి అనుమతించకుండా ఆ ప్రాంతాన్ని తాడులతో బారికేడ్ చేశారు. అధికారులు ప్రజలు సహకరించాలని కోరారు.