చలివేంద్రం ప్రారంభించిన ఎంపీడీవో
GDWL: వేసవి ఎండల దృష్ట్యా మల్దకల్ ఎంపీడీవో ఆంజనేయ రెడ్డి మంగళవారం తాటికుంట స్టేజీ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆయన సూచించారు. ప్రజల దాహార్తిని తీర్చడానికే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజ, ఇతరులు పాల్గొన్నారు.