కులం పేరుతో దూషించిన ఇద్దరికీ 3 ఏళ్ల జైలు శిక్ష

కులం పేరుతో దూషించిన ఇద్దరికీ 3 ఏళ్ల జైలు శిక్ష

KDP:  2019 అక్టోబర్ 11న యర్రగుంట్ల మహాత్మా నగర్‌లో కులం పేరుతో బంగ్లా రమేష్‌పై దూషణ, కాళ్లు చేతులతో తన్ని కట్టెలతో కొట్టిన కేసులో ఇద్దరికి కడప 4వ ఏ డీజే కోర్టు 3 ఏళ్లు సాధారణ జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా 3 నెలల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది.