'264 మద్యం సీసాలు ధ్వంసం'

'264 మద్యం సీసాలు ధ్వంసం'

W.G: ఆకివీడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆకివీడు, ఉండి, కాళ్ల మండలాల పరిధిలో గడచిన ఐదు నెలల కాలంలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 264 మద్యం సీసాలను ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం ధ్వంసం చేశారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్ఐ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వీటిని ధ్వంసం చేశారు. సీఐ ఏ. శ్రీనివాసరావు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.