VIDEO: మస్కట్‌లో గుంతకల్లు మహిళ నరకయాతన
ATP: గుంతకల్లుకు చెందిన జుబేదా అనే మహిళ బతుకుదెరువు కోసం 9 నెలల క్రితం మస్కట్ దేశానికి వెళ్లింది. అయితే, గత 3 నెలలుగా నరకం చూస్తున్నానని.. తనను ఇండియాకు రప్పించాలని కోరుతూ సెల్ఫీ వీడియో ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు విజ్ఞప్తి చేసింది. ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని వేడుకుంది.