ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

NZB: ధర్పల్లి మండలంలో రెండో విడత స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో, వార్డుల వద్ద ఓటర్లు బారులు తీరి నిల్చున్నారు. ఉదయం 10 గంటల వరకు 20% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ధర్పల్లి పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.