యువకుడు అదృశ్యం.. ఇంటి వద్ద ఉద్రిక్తత

NTR: గుణదల ప్రాంతంలో శనివారం రాత్రి వినాయక నిమజ్జనానికి వెళ్లిన పులి రాజా అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాజాతో పాటు నిమజ్జనానికి వెళ్లిన యువకులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో, యువకుల కుటుంబ సభ్యులు గురువారం రాజా ఇంటి వద్దకు చేరుకుని వాగ్వాదానికి దిగారు. పోలీసులు ప్రస్తుతం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.