'ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోండి'
KNR: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్టీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన అభివృద్ధి అధికారిణి కే. సంగీత తెలిపారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థులు డిసెంబర్ 31లోగా e-passలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సంబంధిత హెచ్ఎంలు రిజిస్ట్రేషన్ పత్రాలను అప్లోడ్ చేయాలని ఆమె సూచించారు.