బాలు సంస్కారవంతుడు: వెంకయ్య నాయుడు
TG: బాలసుబ్రహ్మణ్యం కేవలం స్వర సార్వభౌముడు మాత్రమే కాదు.. సంస్కారవంతుడు, నిరాడంబరుడు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన గాత్రంలో నవరసాలు నాట్యం చేసేవన్నారు. డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా, మార్గదర్శిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారన్నారు. HYD రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖను అభినందించారు.