తొట్టంబేడులో సర్పంచుల సన్మాన సభ
TPT: తొట్టంబేడు మండల సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సర్పంచుల అభినందన సభ నిర్వహించారు. గత ఐదేళ్ల కాలంలో ప్రతి గ్రామంలోనూ అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించారని మాజీ ఎమ్మెల్యే కొనియాడారు. సంక్షేమ పథకాల పంపిణీలో వారు చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. సర్పంచులందరిని శాలువాలతో సన్మానించారు.