కండక్టర్‌ను దుర్భాషలాడిన వ్యక్తికి జైలు శిక్ష

GNTR: మేడికొండూరు పరిధిలో 2021లో ఆర్టీసీ బస్సులో విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌ను దుర్భాషలాడి దాడి చేసిన దండు రామనాధ రెడ్డికి 5వ జేఎఫ్‌సీఎం న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించింది. అప్పటి ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేయగా, సాక్షుల వివరాల ఆధారంగా నిందితుడు నేరానికి పాల్పడినట్లు తేలింది. దీంతో కోర్టు శిక్ష విధించింది.